విశ్వ క్రీడ‌లు మ‌రిన్ని విశేషాల‌కూ ఇంకొన్ని గాయాల‌కూ ఇంకొన్ని జ్ఞాప‌కాల‌కూ వేదిక అవుతోంది.ఆ కోవ‌కు చెందిన ఈ వార్త చ‌దివి ఆశ్చర్య పోకండి..అలా అని మ‌రీ! ఆందోళ‌న చెంద‌కండి.విశ్వ క్రీడ‌ల్లో ఒక‌నాటి యోధుడి రాక సాధ్యం కాదు కానీ..అలాంటి ఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది.హెవీ వెయిట్ బాక్సింగ్ విభాగంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో జ‌రిగిన ఘ‌ట‌న 90ల నాటి కాలాన్ని గుర్తు చే సింది. అయితే ప్రత్య‌ర్థి చెవి కొరికిన విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు ఆ విజేత..ఈ క‌థ న్యూజిలాండ్ బాక్స‌ర్ డేవిడ్ నికాకు, మొ రాకో బాక్స‌ర్ యూనెస్ బ‌ల్లాకు మ‌ధ్య జ‌రిగింది. మొద‌ట చెవి కొరికిన దృశ్యాలు వీక్ష‌కుల కంటికీ, రిఫ‌రీ కంటికీ చిక్క‌క‌పోయినా ఆఖ రికి టీవీలో ఇవి ప్ర‌సారితం కావ‌డం సంచ‌ల‌నం అయింది. ఏద‌యితేనేం ఓట‌మో/గెలుపో ఏదో ఒక‌టి రానివ్వండి..కానీ మ‌ళ్లీ ఆనాటి రోజుల‌ను ఆ నాటి చీక‌టి గాయాల‌ను ఇప్పుడు గుర్తుకు తెచ్చేలా మాత్రం ప్ర‌వ‌ర్తించ‌కండి అని కొంద‌రు క్రీడాభిమానులు విన్న‌విస్తు న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: