ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ లు వేయవచ్చని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయిన మెదడు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, సికిల్ సెల్ ఎనీమియా, హైపర్ టెన్షన్, పల్మనరీ, ఊబకాయం స‌మ‌స్య‌లు ఉన్నా కూడా పిల్లలకు కూడా టీకాలు వేయాల‌ని ప్రకటించింది. 

పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు 0.1 మిల్లీలీటర్ ల ఫైజర్ టీకా వేయాల‌ని సూచించింది. ఇది ప్రామాణిక కంటే మూడు రెట్లు తక్కువ అని తెలిపింది. ఇదిలా ఉండగా జూన్ నెల‌లోనే ఇజ్రాయెల్ ఆరోగ్య అధికారులు 12 నుండి 16 ఏళ్ల వ‌య‌స్సు మ‌ధ్య గ‌ల‌ పిల్లలకు టీకాలు వేశారు. ఇక ప్ర‌స్తుతం  ఇజ్రాయెల్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ హెల్త్ పాస్ తప్పనిసరి చేశారు. వందమందికి పైగా పాల్గొనే సభలు సమావేశాల్లో హెల్త్ పాస్ ఉండాల్సిందేన‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: