వివాదాల‌కు దూరంగా ఉండే పెద్ద మ‌నిషిని
ట్ర‌స్టు వివాదం మాత్రం కంటి మీద కునుకు
లేకుండా చేస్తుందా?
అయినా కూడా
ఆయ‌న పోరాడుతున్నారు
కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు
తాజాగా ఆయ‌న‌కు ఊర‌ట..
ఆ వివ‌రం ఈ సంక్షిప్త వార్త‌లో...


 మాన్సాస్ కు సంబంధించి ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు మాజీ ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నా, ఇవాళ హైకోర్టులో మాత్రం ఉప‌శ‌మ‌నం ద‌క్కింది.ఇటీవల మాన్సాస్ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై న‌మోద‌యిన కేసు కు సంబంధించి న్యాయమూర్తి స్టే విధించారు. ఆయ‌న‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకునేందుకు వీల్లేద‌ని స్ప‌ష్టం చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చా రు. అశోక్ త‌ర‌ఫున ఇద్ద‌రు సీనియ‌ర్ లాయ‌ర్లు సీతారామ మూర్తి, అశ్వ‌నీ కుమార్ వాద‌న‌లు వినిపించారు. ఆ రోజు ఉద్యోగులు జీ తాలు అడిగితే ఈఓ దానిపై ఎటువంటి క్లారిఫికేష‌న్ ఇవ్వ‌కుండా, కొన్ని బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసి ప్ర‌భుత్వ పెద్ద‌ల త‌ర‌ఫు మ‌నిషి గా వ్య‌వహ‌రించ‌డంతో ఈ త‌గ‌దాలో అశోక్ త‌ల‌దూర్చాల్సి వ‌చ్చింద‌ని, నాటి ఘ‌ట‌న‌లో ఈఓ త‌ప్పిదం కార‌ణంగానే ఉద్యోగుల‌కు  జీ తాలు అంద‌లేదు అని వివ‌రించి, కోర్టుకు అందుకు త‌గ్గ ఆధారాలు చూపించారు. మ‌రోవైపు సంచ‌యిత గ‌జ‌ప‌తి సైతం డివిజ‌న్ బెం చ్ ను ఆశ్ర‌యించారు. అశోక్ ను ట్ర‌స్ట్ చైర్మ‌న్ గా పున‌ర్నియామ‌కాన్ని స‌వాలు చేస్తూ ఆమె వేసిన పిటిష‌న్ అనుమ‌తించాలా వ‌ద్దా అన్న అంశంపై ఈ నెల ప‌దో తేదిన వాద‌నలు వింటామ‌ని కోర్టు పేర్కొంది. అశోక్ కు అనుకూలంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ ఆమె డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌య‌మించ‌డ‌మే కాకుండా ప్ర‌సార మాధ్య‌మాల్లో కూడా కొంత పోరు స్వ‌రం వినిపిస్తు న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: