ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం పేరుతో మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇక జగనన్న పచ్చ తోరణం -  వనమహోత్సవం కార్యక్రమం ఈ రోజు ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో సీఎం జగన్ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఈ ఏడాది భారీ టార్గెట్ ను ప్రభుత్వం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది మొత్తం 75 లక్షల మొక్కలు నాటుతామని అని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తున్న జగనన్న కాలనీ లో కూడా నాటుతామని స్పష్టం చేశారు. అలాగే నాడు నేడు లో భాగంగా పాఠశాలలలో మరియు వైద్యశాలలో కూడా మొక్కలు నాటుతాం అని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో వృక్షసంపద పెరుగుతుంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీలో జగనన్న పచ్చ తోరణం - వనమహోత్సవం పేరుతో చేస్తుంటే తెలంగాణ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని హరితహారం పేరుతో పిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: