బీహార్లో లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ జర్నలిస్ట్ మర్డర్ ఘటన సంచలనం రేపుతోంది. మూడు రోజులపాటు కనిపించకుండాపోయిన జర్నలిస్ట్ మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించగలిగారు. వివరాల్లోకి వెళితే న్యూస్ జర్నలిస్ట్ మనీష్ కుమార్ సింగ్ హత్య జరిగింది. దీనికి కారణం ఏంటో తెలియలేదు గానీ మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా మనీష్ సింగ్ మృతదేహాన్ని గచ్చితోలా, మత్లోహియర్ గ్రామంలోని ని ఒక చెరువులో నుంచి బయటకు తీశారు. ఈ కేసులో మహమ్మద్ అర్షద్ ఆలం వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని విచారించి మర్డర్ కు గల కారణమేంటో తెలుసుకోనున్నారు పోలీసులు. ఇందులో ఇంకా ఎవరి హస్తం ఉంది? ఎవరి ప్రమేయంతో ఈ పని చేశారు? అనే విషయాలను దర్యాప్తులో తెలుసుకుంటారు. ఆ తర్వాత అతనిని తరలిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: