గులాబ్ తుఫాను ప్ర‌భావంతో శ్రీ‌కాకుళం మొదలుకుని ప‌లు ప్రాంతాలలో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాల‌పైనే అం తా ఫోకస్ చేసి ప‌నిచేస్తున్నారు. ఇవాళ ఆదివారం అయిన‌ప్ప‌టికీ శ్రీ‌కాకుళంలో అధికారుల సెల‌వును ర‌ద్దు చేశారు. తుఫాను తీరం దాటే స‌మ‌యంలో ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లూ జ‌ర‌గ‌కుండా, ప్రాణ‌, ఆస్తిన‌ష్టాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌ధానికి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ జ‌గ‌న్ కు తెలుగులో ట్వీట్ చేశారు. గులాబ్ తుఫాను గురించి జ‌గ‌న్ గారితో మాట్లాడాను...కేంద్రం నుంచి త‌క్ష‌ణ స‌హాయం అందేలా చూస్తాను అని హామీ ఇచ్చాను. అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని ప్రార్థిస్తున్నాను...అని ట్వీట్ చేశారు. బీజేపీ ఏపీ విభాగ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో పీఎం చెప్పిన మాట‌ల‌ను ఎఫ్బీలో పోస్టు రూపంలో ఉంచారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు రాష్ట్రానికి ఉంటుంద‌ని ప్ర‌ధాని మాట‌ల‌నే మ‌రోసారి చెప్పారు. ఆంధ్ర ప్ర‌జ‌ల‌లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

ap