మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. ప్ర‌కాష్ రాజ్ ఆధ్వ‌ర్యంలో తెర‌పైకి క‌న‌ప‌డుతున్న‌ప్ప‌టికీ తెర‌వెన‌క ఎవ‌రున్నార‌నే విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఎన్నిక‌ల్లో ఓటు వేసి గౌర‌వించిన‌ప్పుడు వారిని ఓట్లు పొందిన‌వారు కూడా గౌర‌వించాలి. నాకు న‌చ్చిన ప‌ద‌వి రాలేదు.. నేను అధ్య‌క్షుడిగా గెల‌వ‌లేదు.. అంటే.. ఒక‌వేళ ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడిగా గెలుపొంది ఉంటే మంచు విష్ణు టీమ్ కూడా ఇలాగే చేసివుండేదా? అనే అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 900 మంది స‌భ్యుల‌న్న ఒక సంస్థ కోసం, ఒక చిన్న ప‌ద‌వి కోసం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో, చేసేవారికి, చేయించేవారికే తెలియాలి. మాస్ మసాలా మాత్రం క‌థ‌లో బాగా ద‌ట్టించారు. ప్రేక్ష‌కుల‌కు కూడా కావాల్సింది అదేక‌దా. వీరంద‌రినీ చూసి ఇన్నాళ్లు మ‌నం సినిమాలు చూసింది వీరివా? అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారంటే వారిదృష్టిలో వీరంతా ఎంత చుల‌క‌న అయిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. త‌ర్వాత మ‌ళ్లీ వీరి సినిమాలు విడుద‌లైనా ఎంట‌ర్ టైన్‌మెంట్ ఏమీ ఉండ‌దు కాబ‌ట్టి ప్ర‌జ‌లు కూడా సినిమాలు చూసి ఆద‌రిస్తారు. ఆ ఒక్క బ‌ల‌హీన‌త‌ను ఆస‌రాగా చేసుకొని సినీ ప‌రిశ్ర‌మ‌లో వీరిష్టం వ‌చ్చిన‌ట్లు చేస్తున్నారు.. ఆడుతున్నారు.. అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు ప‌లువురు సీనియ‌ర్ సినీ విశ్లేష‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa