మా అధ్యక్ష ఎన్నిక‌కు పోటీప‌డి మంచు విష్ణు చేతిలో ఓట‌మి పాలైన త‌ర్వాత ప్ర‌కాష్రాజ్‌కానీ, అత‌ని ప్యానెల్ స‌భ్యులుకానీ చేసిన ర‌చ్చ అలా ఇలా లేదు. నానాయాగీ చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సినీన‌టుల ప‌రువు రోడ్డున ప‌డ్డ‌ది అనుకుంటే ఎన్నిక‌లైన త‌ర్వాత అంత‌కంటే ఎక్కువ ప‌డింది. మోహ‌న్‌బాబు దౌర్జ‌న్యం చేశారంటూ మీడియా స‌మావేశంలో బెన‌ర్జీ లాంటి న‌టులు క‌న్నీరు పెట్టుకున్నారు. త‌నీష్లాంటివారు భావోద్వేగానికి గుర‌య్యారు. అలాంటిది ఒక్క‌సారిగా ప్ర‌కాష్ రాజ్ ఈరోజు ఒక ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ ప్లేటు ఫిరాయించారు. మోహ‌న్‌బాబు మంచి హాస్య చ‌తుర‌త క‌లిగిన వ్య‌క్తి అని కొనియాడారు. త‌న ప్యానెల్ స‌భ్యుల‌పై ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ స‌భ్యులు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డార‌ని అప్పుడే మోహ‌న్‌బాబుకు చెప్పాన‌ని, ఆయ‌న త‌న‌కు సారీ చెప్పార‌ని తెలిపారు. ఆయ‌న్ని డిస్ట‌ర్బ్ చేయ‌కుండా ఉంటే ఆయ‌నంత మంచి వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌ర‌ని, ఒక‌వేళ డిస్ట‌ర్బ్ చేస్తే ఆయనేం చేస్తారో ఆయ‌న‌కే తెలియ‌ద‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించ‌డానికి రాజ‌కీయ పార్టీలు కూడా భాగ‌స్వాముల‌య్యాయ‌ని ఆరోపించారు. మంచు విష్ణు గెల‌వ‌డానికి భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు బాగా ప‌నిచేశార‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa