క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌స్తుతానికి స‌మాజం ముందున్న ఏకైక ప‌రిష్కారంగా టీకా ఒక్క‌టే క‌న‌ప‌డుతోంది. రెండు డోసుల టీకా వేయించుకుంటే శ‌రీరంలో యాంటీబాడీలు పెరిగి క‌రోనా సోకినా ఆసుప‌త్రి పాలు కాకుండా త‌క్కువ‌గా త‌గ్గిపోయే అవ‌కాశ‌మొక్క‌టే ఉంటోంది. అంత‌కుమించి క‌రోనా రాకుండా ఉంటుంద‌నే న‌మ్మ‌కం అయితే లేదు. కేవలం క‌రోనా సోకినా దాంతో పోరాటం చేసే బ‌లం ఇవ్వ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతోంది. అయితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న సంద‌ర్భంగా జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనా వ‌ల్ల క‌లిగిన ఆందోళ‌న నుంచి ప్ర‌జ‌ల‌న భ‌రోసావైపున‌కు న‌డిపించ‌గ‌లిగామ‌న్నారు. క‌రోనా రెండోద‌శ‌లో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా చేతులెత్తేయ‌డంతో ఎంత‌మంది మృత్యువాత ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌యివేటు ఆసుప‌త్రులు రోగుల‌ను అందిన‌కాడికి దోచుకున్నాయి. క‌నీసం నాలుగు ల‌క్ష రూపాయ‌లు క‌డితేకానీ ఎవ‌రినీ ఆసుప‌త్రుల్లో చేర్చుకోలేదు. ఆరోజు లేని భ‌రోసా, కేంద్రం నుంచి రాని భ‌రోసా ఇప్పుడు టీకా వ‌ల్ల ఎలా వ‌స్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: