వరంగల్ జిల్లాలో నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ తో మరణించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేకెత్తించింది. ఒకవైపు కరోనా, మరోవైపు డెంగ్యూతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్న తరుణంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుకునేందుకు తీసుకునే మాంసం జంతువుల్లో ఆంత్రాక్స్ వెలుగుచూడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కడా ఈ వ్యాధి బయటపడకపోయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. గొర్రెలు, మేకల మాంసం తినడం మానేయాలని సూచిస్తున్నాయి. మాంసం కొనుగోలు చేసేముందు పశువైద్యులు వాటిని తనిఖీ చేశారో లేదో అనే విషయాన్ని ప్రతిఒక్కరూ నిర్థారించుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. జీవాలను కోసినప్పుడు వాటి రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలోనే ఉంటే వాటికి ఆంత్రాక్స్ ఉన్నట్లుగా భావించాలి. తినే గ్రాసం, తాగే నీరు, ఇతర కీటకాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. సోకిన మూడురోజుల్లోనే జీవాలు మరణిస్తాయి. మరణించినవాటిని ఊరికి దూరంగా మూడడుగులల్లోపు గొయ్యితీసి సున్నం వేసి పాతిపెట్టాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి