ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఇవాళ జ‌రిగిన ఇవాళ చోటు చేసుకున్న ఘ‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాస‌న‌స‌భ‌లో టీడీపీ, వైసీపీల మ‌ధ్య వాగ్వాదం సంర‌ద్భంగా.. త‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రినీ కించ‌ప‌రిచేలా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానించార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు క‌న్నీటిప‌ర్వంత‌మ‌య్యారు. ఆ త‌రువాత  ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కూడా  అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుని చంద్ర‌బాబు వెక్కివెక్కి ఏడ్చారు.

ఈ ప‌రిణామంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకునే రాజ‌కీయ ప‌రిణామాలు ఆవేద‌న‌ను క‌లిగిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు త‌న భార్య‌ను కించ‌ప‌రిచార‌ని కంట త‌డి పెట్టార‌ని, ఆయ‌న కంట త‌డి పెట్ట‌డం చాలా బాధ క‌లిగించింద‌ని వెల్ల‌డించారు. కుటుంబ స‌భ్యుల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌గ‌ద‌న్నారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. రాష్ట్రంలో వ‌ర‌ద‌లు విజృంభిస్తుంటే.. వ‌ర‌ద‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: