ఢిల్లీ ప్ర‌భుత్వం తాజాగా  ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ది.కాలుష్యం కార‌ణంగా మూత‌ప‌డిన స్కూళ్ల‌ను త‌క్ష‌ణ‌మే తెరిచేందుకు సిద్ధ‌ప‌డిన‌ది ప్ర‌భుత్వం. కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభ‌న వేళ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని 6వ‌త‌ర‌గ‌తి ఆపై విద్యార్థుల‌కు పాఠ‌శాల‌లు, క‌ళాశాలలు తెరిచేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ది ప్ర‌భుత్వం. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చేవిధంగా త‌ర‌గ‌తుల‌ను పునఃప్రారంబించేందుకు అధికారిక నోటీస్ శుక్ర‌వారం అధికారుల‌కు అనుమ‌తిచ్చింది. క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌తో సంప్ర‌దించిన త‌రువాత ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఐద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థులు డిసెంబ‌ర్ 27 నుంచి ప్రారంభం కావ‌చ్చు అని.. కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఓ ప్ర‌ట‌న‌లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుస‌రించి విధించిన ఆంక్ష‌ల‌పై స‌డ‌లింపుల‌కు  సంబందించిన వివిధ సంస్థ‌ల అభ్య‌ర్థ‌న‌ల‌ను క‌మిష‌న్ ప‌రిశీలించింద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. న‌గ‌రంలో వాయు కాలుష్యం స్థాయి పెరిగిన‌ప్ప‌టికీ ఢిల్లీ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల్లో భౌతిక త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తుండ‌టంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంత‌రం.. డిసెంబ‌ర్ 3న దేశ రాజ‌ధానిలోని పాఠ‌శాల‌లు మూసివేసారు. ఇదిలా ఉండ‌గానే మ‌రోవైపు ఢిల్లీలో నిన్న ఒక్క‌రోజే 10 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అవ్వ‌డంతో.. టెన్ష‌న్ క‌లిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: