ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అనేక మంది టీడీపీ నాయకులను వైసీపీ నాయకులు చంపుతున్నారని విమర్శిస్తోంది. కొన్నిరోజుల క్రితం పల్నాడులోని జల్లయ్య అనే టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తల దాడిలో చనిపోయాడని టీడీపీ తెలిపింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున సాయం అందించేందుకు నిన్న టీడీపీ నేత నారా లోకేశ్ గుంటూరు నుంచి పల్నాడుకు వెళ్లారు.


అయితే.. ఈ పరామర్శ యాత్రలో టీడీపీ నేతల అత్యుత్సాహం విమర్శల పాలైంది. అదేదో జైత్ర యాత్రకు వెళ్తున్నట్టుగా  నారా లోకేశ్‌కు భారీగా స్వాగతాలు పలకడం.. గజమాలలో హడావిడి చేయడం విమర్శల పాలైంది. ఓ విషాదంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్తూ.. ఈ హాడావిడి ఏంటన్న విమర్శలు వినిపించాయి. అయితే.. పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే.. మేమంతా ఉన్నామని ఘనంగా చెప్పేందుకే ఈ హడావిడి అని టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నా.. ఓదార్పు యాత్రలు ఎలా చేయాలో నారా లోకేశ్ ఇంకా తెలుసుకోవాల్సి ఉందంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: