హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ - నార్మ్‌ కు  ప్రతిష్టాత్మక ఐసీఏఆర్ సర్థార్ పటేల్ పురస్కారం వరించింది. వ్యవసాయ రంగం, రైతాంగం లక్ష్యంగా సేవలందిస్తున్న ఈ సంస్థ మరో మైలు రాయి అధిగమించింది. ఏసీఏఆర్ 94వ వ్యవస్థాపక దినోత్సవం వేళ దిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా నార్మ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు పురస్కారం అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తూ ఎన్నో ప్రభుత్వ విధానపరమైన పథకాల రూపకల్పన, విధివిధానాలు రూపొందిస్తూ థింక్‌ ట్యాంక్‌ సంస్థగా నార్మ్‌ ఖ్యాతి గడించింది. రాజేంద్రనగర్‌ వేదికగా వ్యవసాయ రంగం, అన్నదాత సేవలో నార్మ్‌ నిమగ్నమైంది. ఐసీఏఆర్ శాస్త్రవేత్తలుగా ఎంపికైన అభ్యర్థులను శాస్త్రీయపరమైన శిక్షణ ఇవ్వడం ద్వారా భావిశాస్త్రవేత్తలు, సంస్థల అధిపతులు, విధాన రూపకల్పనకర్తలుగా నార్మ్‌ తీర్చి దిద్దుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: