హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు కు సంబంధించి తాజాగా ప్రభుత్వం కొన్ని వీడియోలు విడుదల చేసింది. ఎయిర్ పోర్టు కు మెట్రో సేవలు అందించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు వివరించింది. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి సుమారు 900 మీటర్ల మేరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం రాయదుర్గ్ స్టేషన్‌ను పొడిగించి అక్కడ ఎయిన్ పోర్టు మెట్రో స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఐకియా భవనం తర్వాత ఎల్ అండ్ టీ, అరబిందో భవనాల ముందు ఈ రెండు కొత్త స్టేషన్‌లు ఒకదానిపై ఒకటి నిర్మింస్తారు.

రాయదుర్గ్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మొత్తం 31 కారిడార్లు నిర్మిస్తారు.  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఆవల నుండి వచ్చే ప్రయాణీకులను అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.  ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్టంగా 120 కిమీ వేగంతో వెళుతూ...31 కిమీ దూరాన్ని 26 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెట్రో నిర్మాణం కోసం ఈ నెల 9 న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: