కేసీఆర్ మాదిగలను నిలువునా మోసం చేశారా.. అంటే అవునంటున్నారు మాదిగ నాయకులు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఆ మాట తప్పారని.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మాట తప్పారని గుర్తు చేసుకుంటున్నారు. నిన్న సికింద్రాబాద్ లో
నిర్వహించిన విశ్వరూప మహా సభకు ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు.


కేసీఆర్ వెలమలకు మాత్రం నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని.. కానీ.. నాలుగు సార్లు గెలిచిన దళిత ఎమ్మెల్యేలను కేసీఆర్ మంత్రిని చేయలేదని మాదిగలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లపై ఉరించిందని అంటున్నారు. నరేంద్ర మోదీ ఒకేసారి రాజ్యసభ, లోక్ సభలో మహిళా బిల్లును ఆమోదింపజేశారని.. కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని అన్యాయం చేసిందని.. వారు తల్చుకుంటే కానిది ఏమీ లేదని.. మోదీ మాట ఇస్తే తప్పడని.. విశ్వాసం బలంగా ఉందని మాదిగలు అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే.. దక్షిణాదిలో మాదిగల అండదండలు భాజపాకు ఉంటాయని భరోసా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: