బైక్ ఉంటే ఆ సరదానే వేరు.. ఎప్పుడు ఒక ఫీలింగ్ తో ఉండే యువతకు ఇంక బైక్ ఉంటే గాల్లో తేలిపోయినంత ఆనంద పడతారు.. అది నిజమే అనుకోండి.. ఇక బైక్ లో కొత్త కొత్తగా మార్కెట్ లో వస్తుంటాయి.. వాటిని కొనుక్కోవాలి అనుకుంటారు.. కానీ షో రూం లో బైక్ లు కొనాలంటే భారీగా ఖర్చు చేయాలి అలాంటి వారు ఇలా కొనుకుంటే సరిపోతుంది..లక్షలు పెట్టే బదులు సింపుల్ గా ఇలా చేస్తే సరి.. బైక్ ఉంటుంది మన కోరికా తీరుతుంది.ఎలానో ఇప్పుడు చూద్దాం..



 మీకో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే మంచి బైక్‌ను ఇంటికి తీసుకెళ్లొ్చ్చు. అయితే ఇది సెకండ్ హ్యాండ్ బైక్.అందుబాటు ధరలోనే సెకండ్ హ్యాండ్ బైక్‌ కొనుగోలు చేయడమన్నా కష్టమే. ఈ బైక్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయో తెలుసుకోవాలి. అక్కడకు వెళ్లాలి... వెళ్లినా నచ్చిన బైక్ లభిస్తుందో లేదో తెలీదు. ఒకవేళ బైక్ నచ్చినా కూడా ధర కూడా సరిపోవాలి. ఇలా ఎన్నో రకాల అంశాలు కలిసి ఉంటాయి.



అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అసలు లేదు.. ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన బైక్ ను ఇంటికే తెచ్చుకోవచ్చు.. వివరాల్లోకి వెళితే..డ్రూమ్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సెకండ్ బైక్స్ కొనొచ్చు. మీకు చాలా రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన బైక్ ను నచ్చిన విధంగా కొనుగోలు చేసుకోవచ్చు..యమహా ఎస్‌జెడ్ఆర్ 150 సీసీ బైక్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇది 2015 మోడల్. దాదాపు 16 వేల కిలోమీటర్లు తిరిగింది. ఈ బైక్‌ను మీరు రూ.35 వేలకే కొనొచ్చు. అలాగే బజాజ్ వీ15 150 సీసీ బైక్ కూడా రూ.40 వేలకు అందుబాటులో ఉంది... మహీంద్రా , హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్, సీసీ బైక్ లు కూడా అందుబాటులో ఉన్నాయి..మీకు నచ్చిన ధర అంటే కొత్తగా ఉన్నా కూడా తక్కువ ధరలో బైక్ లు లభిస్తాయి.. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా కొనుగోలు చేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: