కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రజలకి పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం ద్వారా నిత్యావసర వస్తువులను అందజేశారు.ఈ పథకంలో భాగంగా గత ఎనిమిది నెలల నుంచి ప్రతి నెలా 5 కిలోల బియ్యం, గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. నెలవారీ కోటాకు ఇవి అదనంగా ఇస్తోంది.. ఈ పథకం వల్ల ప్రజల ఆకలి దప్పులు తీరాయని అంటున్నారు..



దాదాపు 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. గడచిన ఎనిమిది నెలలుగా ఈ పథకానికి లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించి ఇలా ప్రజలకు ఆహారం కోసం నిత్యావసరాలను అందించారు.కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో మొదట మూడు , నాలుగు నెలలు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని భావించారు. కానీ ప్రజల పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడం తో ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.



పలు పండగలు నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నవంబర్ నెల చివరి వరకూ ఉచిత రేషన్ పంపిణీ కొనసాగించాలని నిర్ణయించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తున్నారు.దీపావళి పండగ వరకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయడానికి రూ. 90 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి మూడు నెలలు రూ. 60 వేల కోట్ల ఖర్చు అయినట్లు తెలిపారు.అయితే ఇప్పుడు మాత్రం ఆ పథకాన్ని మరి కొద్ది రోజులు కొనసాగిస్తారని తెలుస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: