దేశంలో కరోనా సంక్షోభం తరువాత కూడా ఇంధన ధరలు వంద దిగిరాలేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఇంధన ధరలు లీటరుకు రూ. వంద దాటేసింది కూడా. దీనితో ఆయా వస్తువుల రవాణా జరగాలంటే ధరలు పెంచాల్సిందే. రవాణా ధరలు పెరిగినప్పుడు ఆయా వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. దీనితో నిత్యావసర వస్తువుల ధరలు అక్కడి నుండి సామాన్యుడి చేతికి వచ్చేసరికే పలు చోట్ల ఈ ధరల పెంపు జరుగుతూ పోతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉదాహరణకు నూనె ప్యాకెట్ లాక్ డౌన్ ముందు 90రూ. లలో ఉంటె అది లాక్ డౌన్ అనంతరం 170రూ.  చేరింది. దాదాపు ఒక్కసారిగా రెండింతలు అయ్యింది ధర. దీనితో సామాన్యుడు తన రేషన్ సగానికి తగ్గించుకోవడం కుదరదు, అలాగే సంస్థలు జీతాలను రెండింతలు చేయలేవు. ఒక్క ఇంధన ధరలు పెరిగితే సామాన్యుడి జీవితంలో జరిగే అత్యవసర వస్తుపోరాటం ఇది.

ఇవన్నీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమి చేయలేక చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నాయి. కరోనా సంక్షోభం వలన మూడు నెలల లాక్ డౌన్ వలన వేల కోట్ల నష్టాలు వచ్చాయి. అందరు వారివారి స్థాయిలో బాధలు  అనుభవించారు. కానీ ఉన్నోడి స్థితి పెద్దగా మార్పు ఉండదు, ఆయా రోజులలో వచ్చే ఆదాయం తగ్గుద్ది అంతే. కానీ సామాన్యుడి పరిస్థితి, జీతం రాక, వచ్చింది పెరిగిన రేట్లకు తగ్గట్టుగా సరిపోక పడిన ఇబ్బంది చెప్పడం కష్టం. అయినా ఉన్నదాంట్లో సర్దుకుంటూ బ్రతుకు ఈడుస్తున్న వాళ్ళపై భారం వేయడానికే ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉంటాయి అదేమిటో! ఒకపక్క సంక్షేమ పధకాల పేరుతో ఇచ్చినవి మరోపక్క ధరల పెంపు పేరుతో లాక్కుంటున్నారు.  

అయితే ఒకరి నష్టం మరొకరికి లాభంగా పరిణమించడం సహజం. కరోనా సంక్షోభంలో కూడా చాలా వరకు అందరు చితికిపోయినా కొందరు మాత్రం కొత్త దనాన్ని స్వాగతించి లబ్ది పొందారు. ఉదాహరణకు మాస్క్ లు తయారీ చేసినవాళ్లు, శానిటైజర్ తయారీదారులు, అలాగే కరోనా కోసం వాడే వివిధ ఔషదాలు  తయారీదారులు తదితరులు లబ్ది పొందారు. అలాగే ఇంధన పెంపు కూడా కొన్ని సంస్థలకు బాగా కలిసి వచ్చింది. అందులో చెప్పుకోదగ్గది సౌదీ అరేబియా సంస్థ ఆరాంకో మాత్రం లాభాల బాట పట్టింది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటల్ విలువ రెండు ట్రిలియన్ డాలర్లు చేరుకుంది. ప్రపంచంలోనే విలువైన సంస్థలుగా చెపుతున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్ బాటలో ఈ సంస్థ చేరింది. దీనికి కారణం అంతర్జాతీయంగా చమురు ధరలు(బ్యారెల్-82డాలర్లు) ఏడు ఏళ్ళ గరిష్ఠానికి చేరడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: