కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదో విధంగా అనేక ప్రయోజనాలు అనేవి ఉంటూనే ఉంటాయి. తాజాగా వారికి మరో చక్కటి శుభవార్త అందింది. ఆఫీస్ పనిగంటల తర్వాత చేసే పనులకు చెల్లించే ఫీజు లిమిట్ అనేది పెరిగింది.దీనికి సంబంధించి ఆయా శాఖలకు ఉత్తర్వులు అందాయి. ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలకు పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) డిపార్ట్‌మెంట్‌ కొన్ని సూచనలు చేసింది. ఆఫీసు పనివేళల తర్వాత ఉద్యోగి చేసే క్యాజువల్ అఫీషియల్ వర్క్‌కు అందించే ఫీజు లిమిట్‌ పెంచుతున్నట్లు పేర్కొంది. ఉద్యోగికి అదనంగా పనిచేసినందుకు అందజేసే నగదును ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1500 నుంచి రూ.5000లకు పెంచుతున్నట్లు పేర్కొంది.ఈ నియమం 2021 నవంబర్ 15 నుంచే అమలులో ఉంది. అయితే చాలా వరకు ఉద్యోగులకు దీనిపై అవగాహన లేదు. దీని ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు గరిష్టంగా ఫీజు చెల్లించవచ్చు. ఆఫీస్ అవర్స్ కంటే ఎక్కువ సమయం చేసే పనికి ఇప్పుడు సంవత్సరానికి రూ.5000 వరకు పొందే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రూ.5000 కంటే ఎక్కువ ఫీజు పొందితే అందులో మూడింట ఒక వంతు కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయాలి.


అయితే సివిల్ ఎంప్లాయిమెంట్‌లో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు రూ. 5000 లిమిట్ అనేది వర్తించదు.సెప్టెంబరు 9 నాటి ఆఫీస్ మెమోరాండం(O.M.)లో, DoPT ఈ వివరాలను తెలియజేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజు లిమిట్‌ను 15.11.2021 నుంచి రూ.1500 నుంచి రూ.5000 వరకు పెంచినట్లు గెజిట్ నోటిఫికేషన్ నం.S.O.4829(E) పేర్కొంది. సప్లిమెంటరీ రూల్ 12ను సవరిస్తూ, 15.11.2021 నాటి గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేశారు. S.E.12 ప్రకారం.. రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వు ద్వారా నిర్దేశిస్తే తప్ప, ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించిన అదనపు రుసుములో రూ.5000 మూడింట ఒక వంతు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు క్రెడిట్ అవుతుంది.అలాగే ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి డీఏ పెంచే అవకాశం ఉందని మీడియా రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ పొందనున్నారు. ఉద్యోగి మూల వేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా జీతం లెక్కిస్తారు. బేసిక్ పే రూ.18,000 ఉన్న ఉద్యోగి జీతాన్ని ఉదాహరణగా తీసుకొంటే.. అంతకుముందు 31 శాతం డీఏ చొప్పున, ఉద్యోగి రూ.5,580 డీఏ అందుకొంటారు. తాజా పెంపు తర్వాత ఉద్యోగికి రూ.6,120 డీఏ లభిస్తుంది. అంటే తాజాగా రూ.540 వరకు పెరగడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: