కావాల్సిన ప‌దార్థాలు:
తలకాయ మాంసం- అర‌కేజి
టమోటా ముక్క‌లు- ఒక క‌ప్పు
పచ్చిమిర్చి- నాలుగు
ఉల్లిపాయలు- రెండు


 
నూనె- త‌గినంత‌
పసుపు- అర టీ స్పూన్‌
కారం- ఒక‌ టీ స్పూన్‌

 

గరం మసాల పొడి- ఒక‌ టీ స్పూను
కొత్తిమీర‌- ఒక క‌ట్ట‌
అల్లం వెల్లుల్లి- ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

త‌యారీ విధానం: ముందుగా తలకాయ మాంసంను శుభ్రంగా క‌డిగి బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు కలిపి తగినంత నీరు పోసి కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్ట‌వ్‌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్ట‌వ్‌ మీద‌ పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి.

 

త‌ర్వాత ఉల్లి పాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా తరుగు వేసి మరో రెండు నిమిషాలు వేగించి, గరం మసాల పొడి కలపాలి. ఇప్పుడు ఉడికించిన కూరను నీరుతో పాటు వేసి చిక్కబడేవరకు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే తలకాయ కూర రెడీ. వేడి వేడి రైస్‌తో దీన్ని తింటే సూప‌ర్ అనాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: