
ఇక సహాయం చేస్తామని మాయమాటలతో నమ్మిస్తూ తీయగా మాట్లాడుతారు. ఇక ఆ తర్వాత సరైన సమయం సందర్భం కోసం చూసుకొని ఆ తర్వాత అసలు రూపాన్ని బయట పెడుతూ ఉంటారు. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది కేటుగాళ్లు దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. దీంతో ఇక సహాయం చేస్తామన్నా కూడా ఎవరిని నమ్మలేని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆమె ఒక వృద్ధురాలు.. ఇంటికి వెళ్లడానికి ఏదైనా వాహనం వస్తుందేమో అని ఎదురు చూస్తుంది.
ఇంతలో ఆమెను గమనించిన ఆటో డ్రైవర్.. రండమ్మ మిమ్మల్ని ఇంటి దగ్గర దిగపెడతాను అంటూ తీయగా మాట్లాడాడు. ఎంతో బాగా మాట్లాడుతున్నాడు మంచి వాడు కావచ్చు అనుకుంది ఆ వృద్ధురాలు. దీంతో అతని ఆటో ఎక్కింది. ఇక ఆ తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి మెడలో ఉన్న పుస్తెలతాడు తో పాటు ఆరు వేల రూపాయల నగదును లాక్కొని పరారయ్యాడు ఆటోడ్రైవర్. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలోని రావాలి వద్ద చోటు చేసుకుంది. మన్నె ఈశ్వరమ్మ నడుచుకుంటూ ఊర్లో కి వెళ్తుంది. ఇంతలో వెనుకనుంచి వచ్చిన ఒక ఆటో డ్రైవర్ ఇక ఇంటి దగ్గర దిగ పెడతాను అంటూ తీయగా మాట్లాడటంతో ఆటో ఎక్కింది. కాని కొంత దూరం పోగానే కత్తితో బెదిరించి మూడు తులాల బంగారు పుస్తెలతాడు ఆరు వేల నగదును అపహరించాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..