ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మహిళలకు రక్షణ పూర్తిగా తగ్గిపోయింది అని అర్థమవుతుంది. కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే ఇది పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మార్చేస్తూనే ఉన్నాయి. అంతే కాదు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి తీసుకు వస్తున్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఓ యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ పోలీస్ స్టేషన్ కు  వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోనే నీచ బుద్ది వున్న అధికారులు  ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేక పోయింది.  అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన 13 ఏళ్ల బాలికపై స్టేషన్ అధికారి లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. లలిత్ పూర్ కు చెందిన బాధితురాలిని నలుగురు వ్యక్తులు ఏప్రిల్ 22 వ తేదీన భూపాల్ తీసుకువెళ్లారు. ఇక అక్కడే మూడు రోజులపాటు అత్యాచారం చేశారు అంటూ బాధితురాలు  తెలిపింది.



 అయితే నిందితుల్లో ఒకరు బాలికను పోలీస్ స్టేషన్ దగ్గర విడిచి వెళ్లారని తర్వాత పోలీస్ స్టేషన్లో కి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా స్టేషన్ అధికారి ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. అయితే ఇక బాధిత బాలిక ఈ విషయాన్ని ఒక స్వచ్ఛంద సంస్థకు వెల్లడించడంతో జిల్లా ఎస్పీ దగ్గరికి ఈ విషయం వెళ్ళింది. ఈ క్రమంలోనే ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వ నిధుల నుంచి తప్పించడం గమనార్హం. విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరారీలో ఉన్న ఎస్హెచ్ఓ ని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ డీజీ భాను భాస్కర్ చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ లు ఎక్కువైపోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: