
ఇక ఇలాంటి సీక్రెట్ కెమెరా లకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆడపిల్లలు షాపింగ్ మాల్ కు వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది.. దుకాణంలో క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. ఏకంగా మహిళల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టాడు. అంతేకాదు ఆ బట్టల దుకాణానికి షాపింగ్ కోసం వచ్చిన కొంతమంది మహిళలు రహస్య చిత్రాలను కూడా సేకరించడం గమనార్హం. అయితే ఏడాది క్రితం నుంచి ఇది జరుగుతూ వస్తుంది.
కానీ ఇటీవలే బాధిత వస్త్ర దుకాణం లో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ ఇక సీక్రెట్ కెమెరా గురించి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేసిన చిత్రాలను చూపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని వస్త్ర దుకాణం లో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను పశ్చిమబెంగాల్ కు చెందిన యువకుడిగా గుర్తించారూ. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు..