ఇటీవల కాలంలో ఉద్యోగమొ వ్యాపారము చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతకడం కంటే నేరాలకు పాల్పడుతూ ఇక వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఈ క్రమంలోనే మాయమాటలతో బురిడీ కొట్టించడానికి ఎంతోమంది కాచుకు కూర్చున్నారు అనే విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది మోసగాళ్లకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి.


 ఇటీవలే ఏపీ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అతని టార్గెట్ ఒంటరి మహిళలు మాత్రమే.. తియ్యగా మాట్లాడతాడు ఇక మహిళలను నమ్మించి బంగారు ఆభరణాలను కాజేస్తాడు. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి అతని పై నిఘా పెట్టిన పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి 5 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే  పన్నెండేళ్లుగా రాష్ట్రంలోని ఎంతో మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.


 నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చంద్ర అలియాస్ చంద్ర చిన్నతనంలోనే తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. అయితే కొన్నాళ్లు కొన్ని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. ఇలాంటి సమయంలోనే జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ గా చేసుకుని తాను ధనవంతుడిని బంగారం వ్యాపారం చేస్తున్నట్లు మాయమాటలతో పరిచయం పెంచుకున్నాడు.. వారికి ఇక మత్తుపదార్థాలు ఇచ్చి బంగారు ఆభరణాలు కాజేసేవాడు. గత ఏడాది జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన చంద్ర తీరులో మార్పు రాలేదు. ఇక ఇటీవల మరోసారి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది మహిళలు అతని చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో మరోసారి కేసులు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని విచారించగా ఇక మరోసారి చంద్ర ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తేలింది

మరింత సమాచారం తెలుసుకోండి: