ఇటీవలి కాలంలో మనుషులు వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా సొంత వారిపైనే దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు   వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయ్. వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో మానవత్వం అనేది కనుమరుగై చివరికి రాక్షసత్వం పెరిగిపోతోందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారూ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. తండ్రి తరువాత తండ్రి లాంటి మామను చెప్పులతో నిర్దాక్షిణ్యంగా కొట్టింది మహిళ. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 తండ్రి సోదరుడితో కలిసి మామ వరసయ్యే వ్యక్తిని దారుణంగా చితకబాదింది. చెప్పులు కర్రలతో కొట్టడమే కాదు నడిరోడ్డుపై ఈడ్చుకు వెళ్ళారు. ఇక ఆ వృద్ధుడిపై కనీస కనికరం లేకుండా ఏకంగా దారుణంగా కొట్టారూ. దిక్కుతోచని స్థితిలో తనను కొట్టవద్దు అంటూ ఆ వృద్ధుడు వేడుకున్నాడు. అయితే ఈ ఘటన పోలీస్ స్టేషన్కు కేవలం కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. ఇలా వృద్ధురాలిపై దాడి చేయడం చూసి స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు అని చెప్పాలి. ఘటనలో గాయపడిన వ్యక్తిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇక ఈ దాడిలో గాయపడిన సుఖ్ దేవ్ సింగ్ యాదవ్ కుమారుడు బబ్లు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..  తన తమ్ముడు మరణించాడని.. దీంతో  అతని భార్య పుష్ప, సోదరుడు కమలేశ్, ఆమె తండ్రి రామ్విలాస్ తన తండ్రి  పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలి అంటూ ఒత్తిడి చేశారు. వెంటనే ఆస్తి పత్రాలను తీసుకు రావాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ అందుకు తన తండ్రి ఒప్పుకోకపోవడంతో నే చివరికి ఇలా దారుణంగా దాడికి పాల్పడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు బబ్లు యాదవ్. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: