ధర్మేచ,అర్థేచ,కామేచ, మోక్షేచ, నాతి చరామి అన్న మాటకు అర్థం తెలుసో తెలియదో కానీ నేటి రోజుల్లో మాత్రం పెళ్లి చేసుకున్న వారు అన్యోన్యంగా మాత్రం ఉండలేకపోతున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం గా బ్రతకాల్సిన వారు బద్ద శత్రువులు గా మారిపోతున్నారు.  పెళ్లయిన కొన్నాళ్ళకి విడిపోతూ  విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎంతో మంది భార్య భర్తలు మాత్రం బ్రతుకు లోనే కాదు మృత్యువులో కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారూ. చావులో కూడా కలిసి అనంత లోకాలకు వెళ్లి పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.


 లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి. గ్రామంలో నివాసం ఉంటున్న రాజయ్య (61)ఇటీవలే గుండెపోటుతో రావడంతో చివరికీ కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యములోనే మృత్యువాత పడ్డాడు. అయితే ఇన్నాళ్లు తనతోపాటే జీవితాన్ని పంచుకున్న భర్త ఇక లేడు అన్న విషయం లచ్చవ్వ (54)కు తెలిసింది. దీంతో అరణ్యరోదనగా విలపించింది. ఇక భర్త అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే భార్య కు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆమె సైతం ప్రాణాలు వదిలింది. ఆ దంపతులను చావు కూడా విడదీయ  లేకపోయింది అంటూ స్థానిక ఇందుకు చర్చించుకుంటున్నారు.


 అయితే కేవలం గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయినా వారి పిల్లలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.  ఎప్పుడు గొడవ పడకుండా ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. ఇక ఇప్పుడు చావు లోను కలిసి ప్రయాణం చేశారు అంటూ కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉండటం గమనార్హం. ఇక వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: