టెక్నాలజీ పెరిగి పోతుంది. మనిషి జీవన శైలిలో మార్పు వస్తుంది. ఒకప్పటి అనాగరికత నుంచి నాగరికత లోకి అడుగు పెడుతున్నారూ ప్రతి ఒక్కరు. ఇలాంటి సమయం లో అటు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. అన్ని విషయాల్లో ఎంతో గొప్పగా ఆలోచిస్తున్న మనుషులు ఆడపిల్లల విషయం లో మాత్రం మానవ మృగాలుగా మారి పోతున్నారు అని చెప్పాలి. దీంతో ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.


 ముఖ్యంగా ఇటీవల కాలం లో కొంత మంది టీచర్లు అయితే ఏకంగా ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారుణంగా తమ దగ్గర చదువుకునే పిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల ఏకంగా దేవాలయం లాంటి పాఠశాలలు, కళాశాలలో తోటి విద్యార్థులు ఆడపిల్లలపై అత్యాచారులకు పాల్పడుతున్న ఘటనలు ఆడపిల్లల భద్రతను మరింత ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. స్కూల్ వాష్ రూమ్ లో 11 ఏళ్ళ విద్యార్థి పై ఇద్దరు సీనియర్ విద్యార్థులు అత్యాచారం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో వెలుగులోకి వచ్చింది.

 విద్యార్థిని క్లాసులోకి వెళుతుండగా ఇద్దరు సీనియర్లు ఎదురుపడ్డారు. విద్యార్థిని వాళ్లకు తాకడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సారీ చెప్పి వెళుతుండగా అమ్మాయిని తిట్టడంతో పాటు వాష్ రూమ్ లోకి లాక్కెళ్లారు. ఈ  క్రమంలోని లోపలి నుండి డోర్ లాక్ చేసి దారుణంగా ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయంపై బాలిక టీచర్కు ఫిర్యాదు చేసిన ఆమె పట్టించుకోలేదు.చివరికి ప్రిన్సిపాల్ కు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: