ఇటీవల కాలంలో ఎంతోమంది యువతీ యువకులు తమ అందానికి మరింత మెరుగులు తిద్దుకునేందుకు చేస్తున్న పనులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూఉన్నాయి. కొంతమంది అయితే దేవుడు ఇచ్చిన అందం సరిపోలేదు అన్నట్లు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటూ ఉండటం కూడా చూస్తున్నాం. అయితే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సామాన్యులు అంత డబ్బు పెట్టలేరు. కాబట్టి ఇక తమకు అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ తోనే అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు అందాన్ని మరింత పెంచుకోవాలనే ఆశ ఊహించని సమస్యలను కూడా తెచ్చి పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక యువతకి ఇలాంటి అనుభవం ఎదురయింది. అందం పెంచుకోవడానికి ఆ యువతి ఫేస్ ప్యాక్ వేసుకుంది. కానీ చివరికి ఆ ఫేస్ ప్యాక్ కారణంగానే నరకాన్ని అనుభవించింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది మెడికల్ షాప్ కు వెళ్లి ఫేస్ ప్యాక్ తెచ్చుకుంటే ఇంకొంతమంది ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఫేస్ ప్యాక్ లను తెచ్చుకుంటున్నారు. కానీ ఇక ఇలా ఫేస్ ప్యాక్ ప్రయత్నాలు మాత్రం కొన్ని కొన్ని సార్లు బెడ్స్ కొడతాయి అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ జరిగిన ఘటన ఉంది. బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేస్ ప్యాక్ తెచ్చుకోకుండా సోషల్ మీడియాలో చూసి ఒక ఫేస్ ప్యాక్ వేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోని ఏదేదో మిక్స్ చేసి ఒక వెరైటీ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకొని ముఖంపై అప్లై చేసింది. కాసేపు అవ్వగానే  మొఖం మెలమెలా మెరిసిపోతుందని భావించింది. కానీ ఆ ఫేస్ ప్యాక్ అది ముఖానికి అతుక్కుపోయింది. దీంతో ప్యాక్ ను తీయడం సాధ్యం కాలేదు. చివరికి చర్మ మంట పుట్టడంతో గట్టిగా కేకలు పెట్టి నరకం అనుభవించింది యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి: