ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా స్నేహం అనే బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. నేటి రోజుల్లో ఎంతోమంది తోబుట్టువులే ఆస్తుల కోసం దారుణంగా ప్రవర్తిస్తున్న సమయంలో.. అటు స్నేహితులు మాత్రం ఎలాంటి కష్టం వచ్చినా తోటి స్నేహితులకు అండదండగా నిలబడతారు అని నిరూపించే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. రక్తసంబంధం లేకపోయినా.. అంతకు మించిన బంధమే స్నేహంలో కనిపిస్తూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా బాధలో ఓదార్చేవాడు.. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేవాడు.. ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా కష్టాల నుంచి గట్టి ఎక్కించడానికి ప్రయత్నించేవాడు. కేవలం ఒక స్నేహితుడు మాత్రమే. అయితే ఇలాంటి మాటలు విన్న తర్వాత ఇలాంటి స్నేహితులు కేవలం సినిమాల్లోనే మాత్రమే కనిపిస్తారు. నిజజీవితంలో మాత్రం ఉండరు అని అంటూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన తర్వాత ఇప్పటికీ స్వార్థంగా ఆలోచించకుండా కల్మషం లేని స్నేహాన్ని కొనసాగిస్తున్న నిజమైన స్నేహితులు అక్కడక్కడ ఉన్నారు అని మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇప్పుడు వరకు ఏకంగా భర్త చనిపోయాడు అన్న బాధతో భార్య కూడా ఇక భర్త చితిలో దూకిన ఘటనల గురించి విన్నాం. అయితే ఇక్కడ యూపీలో మాత్రం ఏకంగా ఒక స్నేహితుడు ఇలాంటి పనిచేశాడు. నగల ఖంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి  మరణం తట్టుకోలేక చితిలో దూకి ప్రాణాలు విడిచాడు మరో స్నేహితుడు. క్యాన్సర్ తో అశోక్ అనే వ్యక్తి మృతి చెందాడు. యమునా నది తీరాన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ అంత్యక్రియల్లో అశోక్ మిత్రుడు ఆనంద్ పాల్గొన్నాడు. స్నేహితుడి చితి చూసి ఆనంద్ తట్టుకోలేకపోయాడు. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయాక ఆ చితిలో దూకి తన ప్రాణాన్ని కూడా వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: