
అప్పుడే పుట్టిన పసికందుకు పీరియడ్స్ రావడం ఏంటి అని అందరూ ముక్కున వేలేసుకుంటారు. కానీ చైనాలోని జజ్జియా ప్రావిన్స్ లో మాత్రం ఇలాంటి తరహా గంటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ఐదు రోజుల వయస్సు ఉన్న కుమార్తెను హాస్పిటల్కు తీసుకువెళ్లింది. అయితే పుట్టిన ఐదు రోజులకే ఆ శిశువుకి పీరియడ్స్ రావడం ప్రారంభమైంది. ఏకంగా పాప శరీరం నుంచి రక్తం రావడం చూసి ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన తల్లీ కూతురుని హాస్పిటల్కు తీసుకెళ్ళింది. అయితే పాపను పరీక్షించిన వైద్యులు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.
తమ కెరియర్ లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు అంటూ డాక్టర్లు కూడా చెప్పుకొచ్చారు. ఇది ఒక అసాధారణమైన కేసు అని అనుకున్నారు. చైనాలో జరిగిన ఈ ఘటన గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. ఒక వివరణ ఇచ్చింది. స్త్రీల శరీరంలో ఉండే ప్రొజెస్టరన్ అనే హార్మోన్ గర్భం దాల్చిన చివరి రోజుల్లో పిండం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఈ హార్మోన్ రక్తం రూపంలో పిల్లల ప్రైవేట్ భాగాల నుంచి బయటికి వస్తుంది. ఇది తరచుగా ఆడపిల్లల్లో జరుగుతుంది. ఇక ప్రజలు దీనిని రుతుస్రావంగా భావిస్తారు. కానీ అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది అంటూ పరిశోధకులు తెలిపారు.