జనసేన, టీడీపీకి మధ్య సీట్ల పంపకం విషయంలో ఏదో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. పవన్, చంద్రబాబు మధ్య మూడు సార్లు మీటింగ్ జరిగినట్లు, టీడీపీ, జనసేన నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పొత్తు ఖరారైయిపోయినట్లు జనసేన కొన్ని సీట్లలో పోటీ చేసేందుకు ఒప్పుకున్నట్లు చర్చ జరిగింది.


కానీ లోకేశ్ పాదయాత్రలో సత్తెనపల్లి స్థానాన్ని కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ స్థానం మరొకరికి ఖరారు చేశారు . ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్థానంలో అభ్యర్థులను ప్రకటించేస్తు వస్తున్నారు. అయితే ఇది టీడీపీ, జనసేన పొత్తు విషయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం, జనసేన కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలంగా ఉండటం, తదితర అంశాల్లో తేడాలు వచ్చినట్లు స్పష్టమవుతోంది.


అయితే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ తన స్పీచ్ లో ఒక క్లారిటీ ఇచ్చేశారు. 2024, 2029 లో జనసేనకు అధికారం ఇవ్వాలని జన సేన అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ నాయకులను కలిసే సమయంలో పవన్ సహకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అగ్ర నాయకులతో టీడీపీ అధినేత సమావేశం అనంతరం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.


జనసేన కోరుకుంటున్న స్థానాల్లో  టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం వల్ల మళ్లీ పొత్తు పెట్టుకునే సమయం వచ్చే సరికి అల్రడీ మేం వాటిని ప్రకటించామని చెబుతారు. దీని వల్ల పొత్తు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జనసేన పార్టీ పది సంవత్సరాలు అవుతోంది. ఈ సారి ఎన్నికల్లో సత్తా చూపించకపోతే పవన్ కల్యాణ్ జనసేనకు కూడా రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి పవన్ కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: