ఏపీకి గుండె కాయ వంటి ప్రాజెక్టు పోలవరం అని చెబుతారు. కానీ.. అనేక కారణాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా ఆలస్యం అవుతోంది. వరదలు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. తాజాగా జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించిన  సీఎం వై.ఎస్‌. జగన్‌ .. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టుకు ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.


పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్ లు ఎలా పూడ్చాలనే అంశంపై నిపుణులతో చర్చించారు. అయితే.. ఈ  గ్యాప్ లు పూడ్చే పనులను నిర్ధారించడానికి 9రకాల టెస్టులు, నివేదికలు అవసరమని అధికారులు తెలిపారు.  చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తి కాక ముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదలు వచ్చాయని  అధికారులు వివరించారు. ఈ వరదలు తగ్గాక పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు  సీఎం వై.ఎస్‌. జగన్‌కు వివరించారు.


వరదలు తగ్గిన తర్వాత పనులు ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధం కావాలని  సీఎం వై.ఎస్‌. జగన్‌ అధికారులకు సూచించారు. ఇదే సమయంలో నిధుల అంశం కూడా చర్చకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్‌ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లు ఉందని   సీఎం వై.ఎస్‌. జగన్‌ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందన్న  సీఎం వై.ఎస్‌. జగన్‌...  పనులను వేగవంతంగా చేయడానికి ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు.


ఈ మొత్తాన్ని అంటే.. అడహాక్‌గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని  సీఎం వై.ఎస్‌. జగన్‌ భావిస్తున్నారు. అడహాక్‌గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టి పెట్టాలని  సీఎం వై.ఎస్‌. జగన్‌ అధికారులకు సూచించారు. నిధుల కోసం  కేంద్రానికి లేఖలు కూడా రాయాలని  సీఎం వై.ఎస్‌. జగన్‌ సూచించారు. అయితే మరి కేంద్రం ఈ నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలరా.. పోలవరం పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకోగలరా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: