టీకా కు అర్థం మార్చిన పాలకులు

బారత్ నేడు శతకోటి టీకాలు పూర్తి చేసిన  దేశంగా సంబరాలు జరుపుకుంటోంది. ఇది నిజం కూడా. కానీ ప్రతి నాణానికి రెండు కోణాలుంటాయి.  కోవిడ్-19 వ్యాక్సిన్ పనిచేస్తోందా ? ఏంత మేర పని చేస్తోంది ? ఎంత కాలం పనిచేస్తుంది ? గతంలో టీకా అంటే ఆ వ్యాధి ఇక సోక దని అర్థం. ప్రస్తుతం టీకా  అర్థాన్నికోవిడ్ వ్యాక్సిన్ మార్చేసింది.  ఇది సాధారణ సూది మందుగా మాత్రమే అని చాలా మంది భావిస్తున్నారు.  అవి ఏంటో ఒక సారి పరిశీలిద్దాం.
భారత దేశంలో అత్యంత చిన్న రాష్ట్రం ఏది అంటే చిన్న పిల్లలు సైతం ఠక్కున సమాధానం వస్తుంది. ఆ రాష్ట్రం మిజోరాం.  మన దేశ జనాభాకు ర్యాంకులు ఇస్తే  క్రింది నుండి రెండవ స్థానంలో మిజోరాం ఉంటుంది.  అక్కడి  జనాభా కేవలం 12 లక్షల 60 వేలు మాత్రమే. ఆ రాష్ట్రంలో దాదాపు 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు.  అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఆ రాష్ట్రం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ. హెచ్.ఓ ) చెబుతున్న దాని ప్రకారం ...ఎక్కడయినా 90 శాతం పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయితే  అక్కడి వారు భయం లేకుండా ఉండవచ్చు. ఈ లెక్క ప్రకార మిజోరాం ప్రజలు కరోనా భయం లేకుండా  నిశ్చింతగా ఉండాలి.

 తాజాగా అక్కడి పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం  భారత్ లో కరోనా పాజిటివిటీ రేటు కేవలం 1 నుంచి ఒకటిన్నర శాతం మాత్రమే ఉంది.  అదే మీజోరాంలో 15% నుంచి 30% పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అది కూడా  గత నెల రోజులుకు పైగా కొనసాగుతున్నది.  బాధా కరమైన విషయం ఏమిటంటే ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉండటం.  ప్రజలు ఇంట్లోనే ఉండాలని,  అత్యవసరమైతే తప్ప బైటికి రావద్దని అక్కడి ప్రభుత్యం ఇప్పటికీ చెబుతోంది. అంతేకాక  24 గంటలు కూడా మాస్కు ధరించి ఉండాలని కూడా అక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఆహారం తీసుకునేటప్పుడు మినహా మిగతా సమయమంతా మాస్కు ధరించి ఉండాలన్నది అక్కడి నిబంధన. పొద్దస్తమానం మాస్క్ ధరించి వుంటే ఆసుపత్రి కి వెళ్లవలసిన అవసరం ఉండదని అక్కడి అధికారులు ప్రజలకు చెబుతున్నారు.
ఆక్సిజన్ మాస్క్ ధరించవలసిన అవసరం అసలే రాదంటున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నినాదాలు కూడా రూపొందించింది. ప్రజల్లోకి తీసుకు వచ్చింది.  వాస్తవాలను పరిశీలించి చూస్తే,,
భౌగోళిక పరిస్థితిని పరిశీలిస్తే ..మిజోరాం పర్వత ప్రాంతం. దాదాపు 90 శాతం రాష్ట్రం అంతా అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. అటువంటి దగ్గర కరోనా ప్రమాదకరంగా ఉండే అవకాశమే లేదు. అయినప్పటికీ 90% ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత వచ్చిన "దుస్థితి" ఇది. తాజాగా భారత్ లో 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ సంఖ్య చాలా తక్కువ అని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: