అవును వైసీపీ కాపు ఎమ్మెల్యలంతా ఇప్పుడు పవన్ కల్యాణ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు...అదేంటి పవన్ ఏమో వైసీపీపై పోరాడుతున్నారు. పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు...అలాంటప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పవన్‌పై ఆశలు ఎందుకు పెట్టుకున్నారని డౌట్ రావొచ్చు. అయితే ఆ డౌట్‌కు ఆన్సర్ కూడా ఉందని చెప్పొచ్చు. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా కొందరు వైసీపీ కాపు ఎమ్మెల్యేల పవన్ చేసే రాజకీయంపైనే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పవన్, టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల వైసీపీలో ఉన్న కాపు నేతలు చాలామంది ఓటమి పాలయ్యారు.

ముఖ్యంగా కాపు వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువుగా ఉన్న గోదావ‌రి జిల్లాల‌తో పాటు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోనూ టీడీపీకి ప‌వ‌న్ ఎఫెక్ట్ ప‌నిచేసింది. అదే పవన్ 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల, టీడీపీ ఓట్లు చీల్చేసి వైసీపీకి మేలు చేశారు. అలా ఓట్లు చీలిపోయి వైసీపీ నుంచి చాలామంది కాపు ఎమ్మెల్యేలు గెలిచేశారు. గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌తో పాటు ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో గెలిచిన కాపు ఎమ్మెల్యేలు కూడా ప‌వ‌న్ చీల్చిన ఓట్ల‌తోనే బ‌య‌ట ప‌డ్డారు. ఒకవేళ అప్పుడు కూడా పవన్, టీడీపీలు కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ కాపు నేతల గెలుపు సాధ్యమయ్యేది కాదని చెప్పొచ్చు.

జ‌న‌సేన వ‌ల్లే టీడీపీ ఏకంగా 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఓట్లు చీలిపోయి ఓడిపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పవన్, ఒంటరిగా పోటీ చేస్తే బెటర్ అని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అసలు టీడీపీతో కలవకపోతే అదే మాకు పది వేలు అని అనుకుంటున్నారు. ఒకవేళ టీడీపీతో కలిస్తే మాత్రం ఆ ఎమ్మెల్యేల పరిస్తితి చెప్పాల్సిన పని లేదు. అలా పవన్ చేసే రాజకీయం మీద ఆధారపడి ఉన్న వారిలో మొదట కాపు మంత్రుల గురించి చెప్పుకుంటే...పేర్ని నాని, ఆళ్ళ నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లు ఉన్నారు.

గత ఎన్నికల్లో వీరికి టీడీపీపై వచ్చిన మెజారిటీ కంటే...వీరి నియోజకవర్గాల్లో జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరు ముగ్గురూ కూడా ప‌ది వేల లోపు ఓట్ల‌తోనే గెలిచారు. ఇక కాపు ఎమ్మెల్యేలు వచ్చి...సింహాద్రి రమేష్, గ్రంథి శ్రీనివాస్, శ్రీనివాస్ నాయుడు, కొట్టు సత్యనారాయణ, దూలం నాగేశ్వరావు ఇలా పలువురు కాపు ఎమ్మెల్యేలు కేవలం పవన్ ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు. కాబట్టి మళ్ళీ వీరి భవిష్యత్ పవన్ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: