కేసీఆర్ కు, ఆయన పార్టీ బీఆర్ఎస్ నేతలకు మహిళలను అవమానించడం అలవాటుగా మారిందంటున్నారు బీజేపీ నేతలు. స్వంతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రసంగిస్తే... దానిని బైకాట్‌ చేశారని.. ఇది ముమ్మాటికి ఆదివాసీ మహిళలను అవమానించడమేనని అంటున్నారు. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరిస్తే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


బీఆర్ఎస్ కు మహిళలంటేనే చిన్నచూపు అని.. వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా వారిని అవమానించడమే పనిగా పెట్టుకుందని.. మహిళ అయిన తెలంగాణ గవర్నర్ పట్ల కూడా బిఆర్‌ఎస్‌ అవమానకరంగా వ్యవహరిస్తోందని... ఇప్పుడు రాష్ట్రపతిని అవమానించారని.. గవర్నర్ విషయంలో తాజాగా కేసీఆర్ సర్కార్ మరోసారి కోర్టు చివాట్లు తిన్నదిని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నడిపించాలనుకొని... కోర్టు చెంప చెళ్లుమనిపించడంతో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానిస్తున్నాం అంటున్నారని అన్నారు.


బడ్జెట్‌కు గవర్నర్ ఆమదం తెలపడం లేదంటూ... గవర్నర్‌ను బదనాం చేయడానికి కోర్టు వెళ్లిన రాష్ట్ర సర్కార్ డామిట్ కథ అడ్డం తిరిగిందన్నటు కోర్టుతో చివాట్లు తిన్నదని.. కోర్టు వ్యవహారంతో.... కేసీఆర్ లెంపలేసుకొని బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ ప్రసంగానికి అంగీకరించారని.. జనవరి 26 వేడుకల విషయంలోనూ కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తలంటిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌  గుర్తు చేశారు.


కరోనాను సాకుగా చూపి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూసిందని.. ఇతర రాష్ట్రాల సీఎంలను పిలిచి ఖమ్మంలో భారీ బహిరంగ సభలు పెట్టడానికి కరోనా అడ్డురాలేదు కానీ.. గణతంత్ర వేడుకల నిర్వహణకు మాత్రం అడొచ్చాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌  ఎద్దేవా చేశారు. మహిళా గవర్నర్ పట్ల ఇది కక్ష సాధింపు తప్పితే ఇంకోటి కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: