ఏపీలో పొత్తు ధర్మం నడుస్తుందా ? భాగస్వామ్య పార్టీల మధ్య సహృద్భావ వాతవారణం ఉందా? అసలు ఈ మూడు పార్టీలు పరస్పరం గౌరవించుకుంటున్నాయా? వాటి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ జరుగుతోంది. ఒక నియోజకవర్గంలో టికెట్ దక్కకుంటే.. భాగస్వామ్య పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటున్నారు. అయితే పార్టీల నాయకత్వాలకు తెలిసే ఇదంతా జరుగుతుందా లేదా అనేది తెలియ రావడం లేదు.


పొత్తులో భాగంగా సొంతపార్టీపై అసంతృప్తి ఉంటే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లాలి. కానీ ఏపీలో అలా జరగడం లేదు. టీడీపీ నుంచి జనసేనకు, జనసేన నుంచి టీడీపీకి, బీజేపీ నుంచి టీడీపీలోకి నేతలు వలస బాట పడుతున్నారు. వారికి నాయకత్వాలు ప్రత్యేకంగా ఆహ్వానస్తున్నాయి. టికెట్లు ఖరారు చేస్తున్నాయి. దీంతో ఇది పొత్తు పేరుకే అన్నట్లు ఉంది.


తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏపీ బీజేపీలోకి ఒక్కసారిగా వలసలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం, అనంతపురం, కాకినాడ, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులు పురంధేశ్వరి కాషాయ కండువా కప్పుకున్నారు.  రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీలో చేరగా ఆయనకు సీటు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు తణకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముళ్లపూడి రేణుక, హరిశ్చందప్రసాద్ దంపతులు చేరారు. వీరు గతంలో టీడీపీ లో మేయర్ గా కూడా పనిచేశారు.


ఎన్టీఆర్ జిల్లా కాకాణి వెంకటరత్నం నాయుడి మనువడు కాకాని తరుణ్, కాకినాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి, తేజశ్వేరావు, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరిలో కొంతమంది టీడీపీకి చెందిన నేతలు ఉండటం గమనార్హం. అసలు పొత్తులో ఉండగా ఒకరి పార్టీకి చెందిన నేతలు మరో పార్టీలో చేర్చుకోరని ఇదెక్కడి పొత్తు ధర్మం అంటూ పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా బీజేపీ కి చెందిన నేతలను పార్టీలోచేర్చుకొని టికెట్లు ప్రకటిస్తోంది. ఇరుపార్టీలు ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: