చంద్రబాబు పొలిటికల్ గా ఊహించని స్థాయిలో విజయవంతం కావడానికి ఆయన పన్నే వ్యూహాలే కారణమని పలువురు పేర్కొంటూ ఉంటారు. ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఏం జరగుతుందో అంతా ఆయనకు తెలుసు. ఇతరులను తన ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలో టీడీపీ అధినేతకు తెలిసినంత మరెవరకీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో..


వాస్తవానికి జనసేన రాష్ట్రంలో 40-45 స్థానాల్లో క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. ఆ సీట్లను జనసేనకు కేటాయిస్తే కనీసం 20కి పైచిలకు స్థానాలను పవన్ కల్యాణ్ తన ఖాతాలో వేసుకుంటారు. కానీ చంద్రబాబు తన రాజకీయ చతురతో ఆ పార్టీని మొత్తానికే 21కి పరిమతం చేశారు. ఇప్పుడు ఇందులో ఎన్ని గెలుస్తుందో చెప్పలేం. ఉదాహరణకు గుంటూరులో రెండు మూడు చోట్ల అంటే గుంటూరు-2, పొన్నూరు స్థానాల్లో గాజు గుర్తు పార్టీ బలంగా ఉంది. విజయవాడలో చూసుకుంటే వెస్ట్ లో  పార్టీ సంస్థాగతంగా కొంచెం బలంగా ఉంది. కైకలూరు ఇలా కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్ల జనసేన ఆటోమేటిక్ గా బలం ఉన్నట్లే లెక్క.


ఇక  ఆపార్టీకి ఆయువు పట్టైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అయితే కనీసం 12 చోట్ల బలంగా ఉంది. కానీ చివరకు ఏం అయింది. ఇటు బీజేపీ, అటు జనసేన బలంగా ఉన్న సీట్లను టీడీపీ తీసుకుంది. వాళ్ల బలహీన సీట్లను ఈ రెండుపార్టీలకు కేటాయించింది. ఉదాహరణకు తీసుకుంటే అనపర్తిలో బీజేపీకి ఎప్పుడు డిపాజిట్లు దక్కలేదు.. టీడీపీ గెలవలేదు.  అందుకే ఆ సీటును కాషాయ పార్టీకి అప్పజెప్పారు. పి.గన్నవరం, పోలవరం స్థానాల్లో టీడీపీ ఓటు బ్యాంకు బలంగా ఉంటే చంద్రబాబు జనసేనకు కేటాయిస్తారా.  


అటు జనసేనకు, ఇటు బీజేపీకి కేటాయించిన సీట్లు చూసుకుంటే సగానికి పైగా ఇప్పటి వరకు టీడీపీ గెలవని.. ఆ పార్టీ బలంగా లేనివి ఇచ్చింది.  మరి అంతా తెలిసి పవన్ కల్యాణ్, బీజేపీ అధిష్ఠానాన్ని ఎలా ఒప్పించారో చంద్రబాబు కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: