ఏపీలో టీడీపీ కూటమి ప్రచారం సాగుతోంది. మొత్తం భారాన్ని అంతా రాజకీయాల్లో తల పండిన చంద్రబాబే మోస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు రోజుల పాటు జరిగిన ఉమ్మడి ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మరిన్ని సభల్లో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు, పవన్ నిర్వహించిన ఉమ్మడి ప్రచారానికి ఒక మాదిరి స్పందన లభిస్తోంది.


అయితే గేర్ మార్చి స్పీడ్ పెంచాలంటే కేంద్ర బీజేపీ అగ్ర నేతలు రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గత అయిదేళ్లుగా అటు చంద్రబాబు, ఇటు వారాహి పేరిట పవన్ కల్యాణ్ లు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. జగన్ ని విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు జనాలకు ఎన్నికల వేళ కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. వారు ఏం చెప్పినా ప్రజలకు రొటీన్ గానే ఎన్నికలకు వెళ్తోంది.  ఈ సమయంలో జగన్ పై బీజేపీ పెద్దన్నలు పవర్ ఫుల్ డైలాగులతో విరుచుకుపడితే కూటమి బండికి దూకుడు వస్తుంది అంటున్నారు.


ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా వచ్చారంటే ఆ హవానే వేరు. ఈ ఇద్దరి ద్వయం ఆయా రాష్ట్రాల్లో పర్యటించారంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ.. వారిని ఇరుకున పడేస్తారు. అదే సమయంలో అవినీతిపై ఆరోపణలు చేస్తూ.. అభివృద్ధిపై హామీలు గుప్పిస్తుంటారు. పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీకి మోదీ తన ప్రచారంతో కొత్త ఊపును తీసుకువస్తున్నారు.


ఇక్కడ ఏపీలో కూడా అలాంటి స్ట్రాంగ్ డోస్ కావాలని కూటమి నేతలు కోరుకుంటున్నారు. ఏపీలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతి.. పాలనలో జగన్ విఫలమైన తీరు.. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు.. ఇలా అన్నీ లెక్కలతో సహా వివరిస్తే కూటమికి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మోదీ సభలతోనే అప్పటి కూటమికి ఉత్సాహం వచ్చింది. మరి ఈ సారి కూడా అగ్రనేతలు వచ్చి ఆ తరహా ప్రచారం చేసి చంద్రబాబుని గద్దెని ఎక్కిస్తారా లేదా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: