తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాలుగు త‌రాలుగా ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కుల‌ను ఎదుర్కొంటూ ప‌డుతూ లేస్తూ రాజ‌కీయాలు కొన‌సాగిస్తున్నారు. నాటి త‌రం చెన్నారెడ్డి, జ‌నార్థ‌న రెడ్డి నుంచి మొద‌లుకుని త‌ర్వాత ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి, ఇక వైస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. అటు జాతీయ స్థాయిలో వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వానీ ఇలా ఇప్పుడు న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయ‌న‌తో రాజ‌కీయాలు చేస్తున్న‌వారు మారిపోతున్నారు.. ఆయ‌న మాత్రం ఇప్ప‌ట‌కీ న‌వ యువ‌కుడిలా రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు.


చంద్ర‌బాబు ప్ర‌తి ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా మార్చుకుంటూ ఎదిగారు. ఎన్నో సార్లు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫెయిల్ అయ్యాయి.. ఇక చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌చ్చాయి. అలా విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఆయ‌న అవ‌మానాలు దిగ‌మింగుకుని పోరాటాలు చేసి విజ‌యం సాధించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు నేటి తరానికి తెలియవు. అస‌లు అప్ప‌ట్లో అభివృద్ధి అనేది సెకండ‌రీ ప్ర‌యార్టీతో ఉండేది.. ఉపాధి, యువ‌త‌, భ‌విష్య‌త్తు గురించి ఆలోచించే నేత‌లే ఉండేవారు కాదు.


ఆ టైంలో చంద్ర‌బాబు త‌న వినూత్న ఆలోచ‌న‌ల‌తో వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందే యువతకు సాయం వరకూ చంద్రబాబు ముద్ర అనన్య సామాన్యం అన్న‌ట్టుగా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే అవేవి అప్ప‌ట్లో జ‌నాల‌కు అర్థం కాలేదు. 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఓడించారు. ఆయ‌న ఓటమి త‌ర్వాత కానీ చంద్ర‌బాబు అంటే ఏంటి ? ఆయ‌న ముందు చూపు.. భ‌విష్య‌త్తు త‌రాల కోసం ఆయ‌న చేసిన పోరాటం, ప‌డిన ఆరాటం అర్థ‌మ‌య్యాయి. 28 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం ఎదుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పే ఈ ఎదుగుదలకు కారణం.


చంద్రబాబు 2004లో ఓడిపోకపోతే.. 2019లో ఓడిపోకపోతే అన్న భావన వచ్చినప్పుడు ఆంధ్రుడికీ అదే అభిప్రాయం వస్తుంది. తన పనితీరుపై ప్రజల్లో అలాంటి ముద్ర వేశారు చంద్రబాబు. చంద్ర‌బాబుకు ఇండియా హెరాల్డ్‌.కామ్ త‌ర‌పున 75వ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: