- ( హైద‌రాబాద్ - ఇండియా  హెరాల్డ్ )

కెసిఆర్ తన రాజకీయ పయనం .. పార్టీ భవిష్యత్తు గురించి తన జీవిత చివరి దశలో ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి టైంలో తండ్రిగా అందరిని ఒప్పించి ఒకేదారిలో తీసుకురావచ్చు .. పార్టీలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందో ముందే క్లారిటీ ఇచ్చి పరిస్థితులను సర్దుబాటు చేయవచ్చు .. కానీ బీఆర్ఎస్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితి కేసీఆర్ చేయి దాటిపోయిందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ఎందుకు?  తన కూతురు కొడుకుకు సర్ది చెప్పలేకపోతున్నారో సాధారణ బి.ఆర్.ఎస్ కార్యకర్తకు కూడా అర్థం కావడం లేదు. బిఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీ.. చీలికలు వస్తే అసలు ఏ చీలిక కూడా ఉనికి కాపాడుకోవడం సాధ్యం కాదు.. ఇది కేసీఆర్‌కు కూడా తెలుసు. కేసీఆర్ సాధించిన విజయాలకు ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉండాలి ... కానీ ఓడిపోయిన తర్వాత ఇమేజ్ మరి దారుణంగా తయారయింది.. బయటకు రావడం లేదు.. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకునే వారు తగ్గిపోయారు.. కేసీఆర్ ఇప్పుడు కవితను బుజ్జగించే పరిస్థితుల్లో లేరు.


అలాగని ఆలే నరేంద్ర - విజయశాంతి - ఈట‌ల రాజేందర్ తో పాటు హరీష్ రావు వంటి వారిని వాడుకుని వదిలేసినట్టుగా కుమార్తెను బయటకు పంపించడానికి ఆయన సాహసం చేయరు. కేటీఆర్ నాయకత్వ సామర్థ్యం పై బిఆర్ఎస్ మెజార్టీ నేతలకు నమ్మకం లేదు. కేవలం కేసీఆర్ ను చూసి మాత్రమే వారు కేటీఆర్ కు మద్దతు పలుకుతున్నారు. కేటీఆర్ కన్నా రెండింతలు ఎక్కువగా హరీష్ రావు నాయకత్వంపై పార్టీ నేతలు చాలామందికి నమ్మకం ఉంది. కేటీఆర్ - కవిత కన్నా హరీష్ రావు అయితే బీఆర్ఎస్ ను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తారని భావిస్తున్నారు. కానీ ఆ విషయం బయటకు చెప్పలేరు. అలా చెబితే మొదటగా నష్టపోయేది హరీష్ రావే. అప్పుడు కెసిఆర్ ఫ్యామిలీకి హరీష్ రావు టార్గెట్ అవుతారు. రేపు కేటీఆర్ , కవిత పార్టీ మాది అంటే మాది అని యుద్ధానికి దిగితే హరీష్ రావు వారిద్దరి వైపు ఉండే అవకాశం లేదు. అప్పుడు ఆయన తన దారి తాను చూసుకుంటారు. అవ‌స‌రం అయితే అంద‌రిని క‌లుపుకుని ఆయ‌న పార్టీ ని త‌న చేతుల్లోకి అయినా తీసుకోవ‌చ్చు. ఇదే జ‌రిగితే ఇలాంటి అద‌ను కోస‌మే వేచి చూస్తోన్న బీజేపీ తెలంగాణ రాజ‌కీయాల్లో అస‌లు ఆట మొద‌లెట్టేస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

brs