ఇంటర్మీడియట్ అనేది పెద్ద పెద్ద చదువులకు గేట్ పాస్ లాంటిది. ఏ కోర్స్ చెయ్యాలన్న ఖచ్చితంగా ఇంటర్ తప్పకుండా చదవాలి. ఇక ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న సిలబస్ మాత్రమే మన చదువులకు ఉపయోగపడుతుంది. ఇక సాధారణంగా ఇంటర్మీడియట్ సిలబస్ చాలా హెవీగా ఉంటుందనే చెప్పాలి. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ కూడా చాలా జాగ్రత్తగా జరుగుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఇప్పుడు అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది.ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ 30శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది.కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో జూనియర్ కాలేజీల పని దినాలు కూడా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్యా మండలి సిలబస్ ను తగ్గిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

ఇక ఇంటర్మీడియట్ సిలబస్ ని తగ్గించడంతో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నిర్వహించే పరీక్షలలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని స్పష్టం చేయడం జరిగింది.ఇక అదే విధంగా తొలగించిన 30 శాతాన్ని కూడా కాలేజీ లో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఇంకా అలాగే ఖాళీ పీరియడ్ లలో బోధించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేయడం అనేది జరిగింది.ఇక ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి నేపథ్యంలో గత సంవత్సరం ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి కూడా తెలిసిన విషయమే. ఇక ఇటీవలే కాలేజీలు కూడా తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులు క్లాసులకు హాజరవడం అనేది జరుగుతుంది.ఇక ఇప్పటికే కొన్ని రోజులు గడిచిపోవడం తో విద్యాశాఖ సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది.ఇక ఏది ఏమైనా సిలబస్ తగ్గించడం అనేది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట కలిగించే విషయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: