ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీగా బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.ఇక ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు అత్యధికంగా యువత పోటీ పడుతూ ఉంటారు. ఇందుకోసం వారు ఎన్నో వేలకు వేలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు.ఇక సామాన్యులకు ఈ మొత్తంలో ఫీజు చెల్లించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ ఎస్టీ స్టడీ సర్కిల్ (ST Study Circle) మంచి శుభవార్త చెప్పింది. వారికి ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక ఈ మేరకు స్టడీ సర్కిల్ ప్రకటన కూడా విడుదల చేసింది. బ్యాంక్ కోచింగ్ కు ప్రిపేర్ అవుతున్న ఎస్సీ, ఎస్టీ ఇంకా అలాగే బీసీ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించడం జరిగింది.స్క్రీనింట్ టెస్ట్ లేదా అర్హత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ వెబ్ సైట్లో వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఇక నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి జులై 14 న అయ్యింది.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం వచ్చేసి జులై 25 వ తేదీన జరుగుతుంది.వీటికి ఎంపికైన వారి జాబితా ప్రకటన వచ్చేసి ఆగస్టు 1 వ తేదీన ఉంటుంది.ఇంకా అడ్మిషన్ డేట్ (ధ్రువపత్రాల వెరిఫికేషన్)ఆగస్టు 3,కోచింగ్ క్లాసుల ప్రారంభం వచ్చేసి ఆగస్టు 5 నుంచి జరుగుతుంది.

ఇక ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా https://studycircle.cgg.gov.in/ అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: ఆ తరువాత Tribal Welfare Department ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: తరువాత హోం పేజీలో మీకు Apply Online ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: ఇక అక్కడ కావాల్సిన పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: