జబర్దస్త్ షో తో కెరియర్ లో హైప్ పెంచుకున్న హైపర్ ఆది ఇపుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అటు సినిమాలు ఇటు టీవి షో లు, స్పెషల్ స్టేజ్ షోలు అంటూ ఫుల్ ఫుల్ బిజీ బిజీ అయిపోయారు. హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్టేజ్ ఎక్కినప్పటి నుండి ప్రతి డైలాగ్ లోనూ పంచ్ లు కురిపిస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగల గొప్ప కళాకారుడు. ప్రస్తుతం ఢీ షో, జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలు, ప్రోగ్రామ్లు చేస్తున్నారు. ఇక ప్రముఖ తెలుగు టెలివిజన్ యాంకర్ కం నటి శ్రీ ముఖి కూడా తన కెరియర్ లో జోరు ప్రదర్శిస్తున్నారు.

మొదట సినిమాల్లో అడుగుపెట్టిన ఈ సుందరి ఆ తర్వాత పటాస్ ప్రోగ్రామ్ తో బుల్లి తెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  ఇటీవలే 'క్రేజీ అంకుల్స్' సినిమాలోనూ నటించింది ఈ అందాల తార. కంగుమనిపించే స్వరం, కళ్ళు మిరిమిట్లు గొలిపే అందం, ఆహా అనిపించే అభినయం శ్రీ ముఖి సొంతం. అందుకే ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు స్టార్ యాంకర్ రవి..ఈయన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనేలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా అంతే హ్యాండ్ సమ్ యంగ్ గా కనిపించే ఈ యాంకర్ మాటల గారడీ మాములుగా ఉండదు. అందులోనూ తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన రవి మరికాస్త పాపులారిటీ వెంటబెట్టుకు వచ్చాడు.

అయితే ఈ ముగ్గురు కలిసి త్వరలో దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్నారు. దుబాయ్ అనగానే వెకేషన్ ట్రిప్ అనుకునేరు...కాదండి ఈ ముగ్గురు కలిసి ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ కు యాంకరింగ్ చేయడం కోసం వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద సెలబ్రిటీలు ముగ్గురు కలిసి వెళుతున్నారంటే అది మామూలు ప్రోగ్రామ్ కాదండోయ్ చాలా బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అయ్యిండే ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామ్ కి రవి కాస్త డౌట్ అని తెలుస్తోంది, ఎందుకంటే ఈయన ఇంకా తన షెడ్యుల్ ఇవ్వలేదట కానీ ఆది, శ్రీ ముఖి మాత్రం ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ కోసం డేట్స్ కూడా ఇచ్చేశారట. మరి ఆ ప్రోగ్రామ్ పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: