ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చలి కాలం.. ఈ కాలంలో అనేక రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబుతో ఎక్కువ మంది సతమతమవుతూ వుంటారు. ఇక ఈ చలి కాలంలో ఈ పదార్ధాలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా వుంటారు. ఆ పదార్ధాలు ఏంటో చూద్దామా...

అల్లం టీ... ఈ చలికాలంలో అల్లం టీ చాలా అవసరం.. దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు ఈ అల్లం టీ తాగడం వలన మంచి ఉపశమనం పొందుతారు. రోజుకి రెండు పూటలా తాగండి. గొంతుకి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.

పీనట్స్... పీనట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బ్రెడ్ పై పీనట్ బటర్ రాసి తినొచ్చు. ఉదయాన్నే వేరుశెనగను తినడానికి ఇతర మార్గాలు వేరుశనగ గుళ్లను ఉప్మా, పోహాలో చేర్చడం, ఇతర ఆహార పదార్ధాలతో షేక్స్, స్మూతీస్ చేసేటపుడు వేరుశనగ గుళ్లను కలపడం.

సన్ ఫ్లవర్ సీడ్స్... పొద్దుతిరుగుడు పువ్వు  విత్తనాల్లో విటమిన్ ఇ కంటెంట్ అధికంగా ఉంటుంది. మీరు ఉదయం తాగే టీతో కలిపి కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటే మంచి బ్రేక్ ఫాస్ట్ అవుతుంది. లేదా మీరు ఓట్ మీల్, సెరెల్, పాన్ కేక్స్, ఇతర ఆహార పదార్ధాలపై పొద్దుతిరుగుడు విత్తనాలని చల్లి తినొచ్చు.

అవకాడో... ఈ మధ్య కాలంలో ఈ రుచికరమైన అవకాడోని బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువగా వాడుతున్నారు. అవకాడో టోస్ట్ తినొచ్చు, కూరగాయ ముక్కలు, గుడ్లు, మీట్ ఇతర పదార్ధాలతో కలిపి తరిగిన అవకాడోను బ్రెడ్ పైన వేసి తినొచ్చు. అవోకాడో వాడటానికి మరో మార్గం ఏంటంటే, మీ భోజనంలో అవకాడోను చేర్చుకోవడం. అవకాడో యొక్క క్రీమీ టెక్స్చర్ బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఆప్షన్..

బాదం... రాత్రిపూట 5 బాదంపప్పులను నానబెట్టి, తరువాతి రోజు ఉదయాన్నే వాటిపై ఉన్న తొక్కను తీసి తినాలి. మీరు మీ మార్నింగ్ టీతో పాటు బాదంపప్పులను తినొచ్చు లేదా వాటిని మీరు మీ బ్రేక్‌ఫాస్ట్‌తోనూ తినొచ్చు. బాదంపప్పులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకోవడం వల్ల మన చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. మృదువుగా చేస్తుంది. చర్మానికి సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడం కోసం బాదంనూనె, బాదం పాలను అప్లై చేయొచ్చు.

బచ్చలి కూర... ఉదయం పూట భోజనంలో ఈ బచ్చలికూరతో ఎన్నో వంటలు చేయొచ్చు. ఉడికించిన, తరిగిన బచ్చలికూరను గుడ్డులో కలిపి ఆమ్లెట్ వేయొచ్చు. శాండ్‌విచ్ లో స్టఫింగ్ లో బచ్చలికూర, పన్నీర్‌ని వాడొచ్చు. అర కప్పు బచ్చలికూరలో మీకు ఒక రోజుకు కావాల్సినంత విటమిన్ ఇ 16 శాతం లభిస్తుంది. మీరు బచ్చలికూరను విడిగా తినొచ్చు, సలాడ్స్‌లో కలుపుకుని తినొచ్చు.

ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: