మనము ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పండ్లు తీసుకుంటాము.దాదాపుగా అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివే.అత్యధికంగా ఆరోగ్యాన్ని అందించే పండ్లలో బత్తాయి పండు ఒకటి, బత్తాయి పండు ను డైరెక్ట్ గా తినవచ్చు, లేదా జ్యూస్ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది.బత్తాయి పండు లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.రోజు బత్తాయి రసం తీసుకోవడం వల్ల వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది.బత్తాయి పండు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...

 బత్తాయి పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో ఉండే ఆమ్లాలు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి.అంతేకాకుండా జీర్ణ సమస్యల నుండి కాపాడతాయి.

 బత్తాయి పండు లో పొటాషియం ఉండటం వల్ల మూత్రపిండాలు, మూత్రాశయం లో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.మలబద్దకంతో బాధపడే వాళ్ళు బత్తాయి రసంలో కొంచెం ఉప్పు కలిపి తాగడం వల్ల మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

 చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నప్పుడు బత్తాయి రసంలో కొంచెం బ్లాక్ ఉప్పు కలిపి రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే డయేరియా వల్ల వచ్చే అలసట, నీరసం వంటి వాటికి బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శక్తి లభిస్తుంది.

 బత్తాయి జ్యూస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదలకు సహాయపడతాయి.అంతేకాకుండా నరాలమీద ఒత్తిడి కలగకుండా చేస్తుంది. రక్తవృద్ధి, వీర్యవృద్ధి కూడా కలుగుతాయి.

 ఆస్తమా వ్యాధి వల్ల వచ్చే దగ్గుతో బాధపడుతున్న వాళ్లకి ఉపశమనం కలగాలంటే బత్తాయి రసంలో జీలకర్ర పొడి, అల్లం పొడి కలుపుకొని తాగితే ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా బత్తాయి జ్యూస్ లో విటమిన్లు ఉండడంవల్ల చర్మ సౌందర్యానికి, జుట్టు పెరుగుదలకు మంచి మందులా పని చేస్తాయి.

 బత్తాయి జ్యూస్ లో ఫ్లేవనాయిడ్లు ఉండడం వల్ల ఫ్లూ వైరస్ తో బాధపడే వాళ్ళు ఈ జ్యూస్ తాగడం వల్ల ఫ్లూ తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా అల్సర్ ను కూడా తగ్గిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు అర గ్లాసు బత్తాయి రసం లో ఆరు స్పూన్లు ఉసిరి రసాన్ని కలిపి ఒక స్పూన్ తేనె రుచి కోసం కలుపుకొని తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: