అల్లం అందరి ఇళ్లల్లో ఉంటుంది. ఎందుకంటే అల్లంను మసాలా కూరల్లో వాడుతారు. ఎక్కువగా నాన్ వెజ్ కూరల్లో  వేస్తారు. అంతేకాకుండా అల్లం తో టీ తయారు చేసుకొని తాగవచ్చు. అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బెల్లం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. చక్కెరకు బదులు బెల్లం ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

 ఒక గ్లాస్ నీటిలో నిమ్మకాయ ని పిండి, రెండు స్పూన్లు అల్లం రసం, రెండు స్పూన్లు తేనె, రెండు స్పూన్లు ధనియాల పొడి కలిపి రోజు ఉదయం పూట ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా, గుండె దడ తగ్గుతుంది.

 శరీరంపై దద్దర్లు,తుమ్ములు రావడం, జలుబు, దగ్గు ఆయాసం వంటి సమస్యలు ఉన్నప్పుడు రెండు స్పూన్ల అల్లం రసంలో, ఒక స్పూన్ తేనె కలుపుకొని ఈ రోజు ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

 అల్లం, బెల్లం ఈ రెండింటినీ సమానంగా తీసుకొని ముద్దగా నూరి రోజు రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల అరికాళ్ళు, అరచేతుల్లో పొట్టు రాలడం తగ్గుతుంది.అలాగే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తీరుతుంది.

  రోజు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ అల్లం రసం లో ఉడికించిన కోడి గుడ్డు కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో శీఘ్ర స్కలనం తగ్గుతుంది. అంతేకాకుండా వీర్యం పడిపోవడం తగ్గి, శృంగార సామర్థ్యం పెరగడానికి సహాయపడుతుంది.

 కొన్ని తులసి ఆకులు, కొంచెం పసుపు అల్లం రసంతో కలిపి నూరి దద్దుర్లు,దురద, మచ్చలు, మొటిమలు వాటిపై రాయడం వల్ల త్వరగా తగ్గుతాయి.

 చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు ఆముదము లో అల్లం రసం కలిపి చర్మానికి పోవడం వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: