ప్రస్తుత కాలంలో మేక వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. వ్యాధి తగ్గడానికి ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మధుమేహం రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆ జాగ్రత్తలు ఏమిటో, ఏ విధంగా పనిచేస్తాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం...

 కృష్ణ తులసి ఆకులను నీటిలో కడిగి నీడలో ఎండబెట్టి కొని పొడిచేసి నిల్వ ఉంచుకోవాలి. ఆహారం తీసుకున్న అందులో చిటికెడు పొడి వేసుకొని తినడం వల్ల మధుమేహ వ్యాధి రాకుండా ఉంటుంది.

 నోటి పూత, నోట్లో  అల్సర్లు , ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తులసి ఆకులను తినడం వల్ల సమస్యలు తగ్గుతాయి. అలాగే తులసి ఆకులను డికాషన్ చేసుకొని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

 తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి తో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు గట్టిగా అవుతాయి. అలాగే నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.

 మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు నేత తులసి ఆకులను నీటిలో బాగా మరగనిచ్చి చల్లారిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

 తులసి ఆకులను నమలడం వల్ల జలుబు,ఫ్లూ వంటివి తగ్గిపోతాయి. అలాగే ఆస్తమా వ్యాధి ఉన్న వాళ్లకు కఫాన్ని రాకుండా చేస్తాయి.

 దగ్గు నుండి ఉపశమనం పొందడానికి తులసి ఆకులు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కడుపులో నులి పురుగులను తగ్గుతుంది. తులసి ఆకులు, మిరియాలు, ధనియాలు మూడింటినీ కలిపి మెత్తగా నూరి తినడం వల్ల వాంతులు రాకుండా ఉండడమే కాకుండా, కడుపులో నులి పురుగులు కూడా నశిస్తాయి.

 తులసి ఆకులకు రక్తంలో ఉండే చక్కర స్థాయిలో తగ్గించే గుణం ఉంది. అందుకే మధుమేహం ఉన్నవాళ్లు తులసి ఆకులు తినడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది.

 కొన్ని తులసి ఆకులను తీసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. ముఖము అందంగా కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: