కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది జిహెచ్ఎంసి పరిస్థితి. హైదరాబాదును బిన్ లెస్ సిటీగా మార్చాలని నగరంలో ఉన్న చెత్త డబ్బాలన్నింటిని తొలగించడంతో చెత్త సమస్య ముదిరింది. గతంలో 100 వరకు వచ్చే ఫిర్యాదులు ఇప్పుడు 500 వరకు చేరాయి. డస్ట్ బిన్ లో ఉండాల్సిన చెత్తంతా రోడ్లపై చేరి సీజనల్ వ్యాధులకు కారణం అవుతోంది. హైదరాబాద్ వాసులను సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. నగరంలో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి.బస్తీవాసులు దవాఖానాల దారి పడుతున్నారు. వైరల్ ఫీవర్ లకు పారిశుద్ధ్య లోపమే  కారణమని జిహెచ్ఎంసి తోపాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఓ వైపు చెత్త కంపు మరోవైపు వైరల్ ఫీవర్ లతో బాధపడుతున్న ప్రజలు శత తొలగించండి మహాప్రభు అంటూ జిహెచ్ఎంసిని వేడుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను బిన్ లెస్ సిటీగా చేయాలన్న లక్ష్యంతో నగరంలో చెత్త డబ్బాలన్ని తొలగించారు బల్దియా అధికారులు. శత డబ్బాలు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. పారిశుద్ధ్య కార్మికులు రోజుల తరబడి చెత్తను తీయకపోవడంతో అక్కడ ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. నగరంలో లోపించిన పారిశుధ్యం పై మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదులు భారీగా వచ్చాయి. దాంతో శానిటేషన్ సిబ్బంది పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడ చెత్త కనిపించినా  చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త  డబ్బాలు తీసివేయకముందు రోజుకు 100 నుంచి 150 వరకు వచ్చే ఫిర్యాదులు డస్ట్ బిన్ లు తొలగించిన తర్వాత  500 నుంచి 600 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇక రికార్డు కానీ ఫిర్యాదులను కలుపుకుంటే 1000 వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా చోట్ల ఐదు రోజులకు ఒకసారి కూడా చెత్త ట్రాలీ లు రావడం లేదని దీంతో ఎక్కడపడితే అక్కడ చెత్త పెరిగిపోతుందని అంటున్నారు ప్రజలు. బిన్ లు ఎత్తివేయడం వల్లే పారిశుద్ధ్య సమస్య రెట్టింపావుతుందన్నారు. చెత్త డబ్బాలు మళ్ళీ పెట్టాలని  డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: