కలబంద ఉన్న వారి ఇంట్లో వైరస్ ఇంకా బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. కలబంద మొక్క ఉన్న ఇంట్లోని వారు వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, పిల్లలు ఉన్న ఇంట్లో కచ్చితంగా కలబంద మొక్క ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కలబంద గుజ్జులో విటమిన్ బి 12, విటమిన్ సి, విటమిన్ ఎ ఇంకా విటమిన్ ఇ లతోపాటు కాల్షియం, జింక్, సోడియం ఇంకా పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి.ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో 30 ఎమ్ ఎల్ కలబంద గుజ్జును వేసి కలిపి తాగడం వల్ల మన శరీరానికి జరిగే మేలు అసలు అంతా ఇంతా కాదు.ఇక ఈ విధంగా తాగడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది.అలాగే నీరసం కూడా తగ్గి శరీరం మంచి బలాన్ని పుంజుకుంటుంది. రోజంతా కూడా చాలా ఉత్సాహంగా పని చేయవచ్చు.ఇక ఈ విధంగా కలబంద గుజ్జును నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. అందువల్ల బరువు కూడా తగ్గుతారు. అలాగే కలబంద గుజ్జును కలిపిన నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడి అజీర్తి ఇంకా అలాగే మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో చాలా ఎక్కువ వేడితో బాధపడే వారు కలబంద గుజ్జును నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. ఈ విధంగా తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇక అలాగే వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటాం.కలబంద గుజ్జును ఉపయోగించేటప్పుడు దానిపై ఉండే పచ్చ సొనను తొలగించి బాగా శుభ్రంగా కడిగిన తరువాతే ఉపయోగించాలి. కలబంద గుజ్జుతో దంతాలను కూడా బాగా శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దంతాల సమస్యలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఈ కలబంద గుజ్జుకు మోకాళ్ల నొప్పులను తగ్గించే గుణం కూడా ఉంది. కలబంద గుజ్జులో ఆవ నూనె కలిపి బాగా మర్దనా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. కలబంద గుజ్జును వేడి చేసి దూదితో మోకాళ్లపై రాస్తూ ఉండడం వల్ల కూడా నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: